News April 6, 2025

జియో వినియోగదారులకు ఆఫర్ పొడిగింపు

image

IPL సందర్భంగా జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో హాట్‌స్టార్ యాక్సెస్‌ను ఫ్రీగా అందిస్తోంది. పలు రీఛార్జ్‌లపై గతంలో ప్రకటించిన ఈ ఆఫర్‌ను తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఆలోగా ₹100/₹195/₹949తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 90days యాప్ ఫ్రీగా చూడవచ్చు. ₹100 రీఛార్జ్‌కు 5GB డేటా, ₹195కి 15GB డేటా, ₹949తో రీఛార్జ్ చేసుకుంటే 84days వ్యాలిడిటీతో డైలీ 2GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా&కాల్స్ పొందవచ్చు.

Similar News

News April 25, 2025

ఆమె చదువు అమూల్యం.. అతని సాయం చిరస్మరణీయం

image

AP: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అమూల్యకు టెన్త్‌లో 593 మార్కులు వచ్చాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ చదువుల తల్లిని కలెక్టర్ అరుణ్‌బాబు సత్కరించారు. ఆమె పేరెంట్స్ అనిల్, రూతమ్మ కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకుని ఆయన చలించిపోయారు. వెంటనే ఒక ఎకరం పొలం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

News April 25, 2025

నేడు పహల్గామ్‌కు రాహుల్ గాంధీ

image

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్‌కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News April 25, 2025

భారత్, పాక్ సంయమనం పాటించాలి: UN

image

పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తల నడుమ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలూ వీలైనంత సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత దిగజారనివ్వొద్దని సూచించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు.

error: Content is protected !!