News April 5, 2025
SBI UPI సేవల్లో అంతరాయం!

UPI సేవల్లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు SBI ప్రకటన విడుదల చేసింది. దీని కారణంగా వినియోగదారులకు UPI సేవల్లో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మరికొంత సమయం పట్టొచ్చని SBI వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతరాయం లేకుండా ఉండేందుకు UPI LITE వాడాలని సూచించింది. మీకూ ఈ సమస్య ఎదురైందా? COMMENT
Similar News
News April 6, 2025
సన్న బియ్యం దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు?: మహేశ్ గౌడ్

తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వానివేనని BJP నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ‘BJP దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రమంత్రి బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి, సొంత పార్టీలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల కోసం కొందరు HCUపై మాట్లాడటం సరికాదు. మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.
News April 6, 2025
కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు

తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై కేసు నమోదవడంతో MAA ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు రావడంతో సస్పెన్షన్‌ను ఎత్తేసింది. ఇదే విషయంపై కళ్యాణి, హేమకు గతంలో చాలాసార్లు <<13300086>>వాగ్వాదాలు<<>> జరిగిన విషయం తెలిసిందే.
News April 6, 2025
APలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం

AP వ్యాప్తంగా క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం(07-04-25) రాయలసీమలో 40-42°C, ఉత్తరాంధ్రలో 39-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.