News April 5, 2025
ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: ఉత్తమ్

TG: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్‌లోపు మొదటిదశ పూర్తి కావాలని నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులను ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెణ జలాశయాల పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, నీరు నిల్వ చేయాలని సూచించారు. అటు జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడతామని పేర్కొన్నారు.
Similar News
News April 7, 2025
పుండు మీద కారం.. గ్యాస్, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్

గ్యాస్ సిలిండర్‌పై ₹50, పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు ₹2 పెంపుపై కాంగ్రెస్ ఫైరయ్యింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం వేశారని మండిపడింది. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రం తీరు ఉందంది. ‘ఇవాళ ముడిచమురు ధర నాలుగేళ్ల కనిష్ఠానికి చేరింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్రం పెంచింది. పైగా ప్రజలపై భారం పడదని డప్పు కొడుతోంది’ అని ట్వీట్ చేసింది.
News April 7, 2025
ఇంగ్లండ్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ నియమితులయ్యారు. జోస్ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఈసీబీ బ్రూక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా దేశం కోసం ఆడేందుకు బ్రూక్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మెగా వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. కానీ అనూహ్యంగా ఆయన ఐపీఎల్ నుంచి వైదొలిగారు.
News April 7, 2025
సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టవద్దు: MP పోలీసులు

మధ్యప్రదేశ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెక్స్ వర్కర్లపై ఎటువంటి వ్యభిచార కేసులు పెట్టరాదని, వారిని మానసికంగా హింసించరాదని ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ, హోటళ్లు, దాబాల యజమానులపై ITPయాక్ట్ కింద కేసు నమోదు చేయాలన్నారు. అమాయక మహిళల్ని పడుపు వృత్తిలోకి తీసుకొస్తున్న వారిని కఠినంగా శిక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.