News March 26, 2024

12న హ్యాపీ డేస్ రీరిలీజ్

image

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హ్యాపీ డేస్’ 2007లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను APR 12న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, రాహుల్ కీలక పాత్రల్లో నటించారు. బీటెక్ లైఫ్, విద్యార్థుల మధ్య స్నేహం, ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ మూవీ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీజే మేయర్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్.

Similar News

News March 19, 2026

టిడ్కో ఇళ్లపై అలర్ట్.. వారికి డబ్బు వెనక్కి!

image

AP: గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టినా, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని సూచించారు. అలాగే నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో చెప్పారు.

News March 19, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్!

image

2026-27లో కేంద్రీయ విద్యాలయాల్లో(KV) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో అడ్మిషన్లకు ఈ నెల 20న 10AM నుంచి ఏప్రిల్ 2 దాకా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు <>వెబ్‌సైట్‌<<>>లో సంప్రదించవచ్చు.

News March 19, 2026

మార్చి 19: చరిత్రలో ఈ రోజు

image

1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం(ఫొటోలో)
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం