News April 6, 2025
ఎకనామిక్ గ్రోత్ రేట్.. రెండో స్థానంలో AP: మంత్రి లోకేశ్

ఎకనామిక్ గ్రోత్ రేట్(2024-25)లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నివేదికను పంచుకున్నారు. AP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) ₹8.73 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 9.69% గ్రోత్ రేటుతో TN తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో AP (8.21%), అస్సాం (7.94), రాజస్థాన్ (7.82), హరియాణా(7.55), ఛత్తీస్‌గఢ్ (7.51), TG (6.69) ఉన్నాయి.
Similar News
News April 10, 2025
ఇవాళ YIPSను ప్రారంభించనున్న సీఎం

TG: HYD శివారు మంచిరేవులలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(YIPS)ను సీఎం రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందులో పోలీసులు, అమరవీరులు, హోంగార్డుల పిల్లలకు 50 శాతం, సాధారణ పౌరుల పిల్లలకు 50 శాతం సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం 200 సీట్లు ఉండగా, భవిష్యత్తులో 5వేలకు పెంచుతారు. అలాగే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 1,750 పడకలతో హాస్టల్‌ను నిర్మిస్తారు.
News April 10, 2025
GOOD NEWS: వడ్డీ రేట్లు తగ్గించిన 4 బ్యాంకులు

రెపో రేటును RBI O.25 శాతం మేర తగ్గించడంతో పలు బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. ఇండియన్ బ్యాంక్, UCO బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు రుణాలపై వడ్డీ రేట్లను 0.35 శాతం మేర కుదించాయి. సవరణ తర్వాత PNB, BOI వడ్డీ రేట్లు 9.10% నుంచి 8.85%కు, ఇండియన్ బ్యాంక్ 9.0% నుంచి 8.7%కు, UCO బ్యాంక్ 8.8 శాతానికి తగ్గుతాయి. కాగా ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల తగ్గింపునకు యోచిస్తున్నాయి.
News April 10, 2025
రేషన్‌లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ

AP: వచ్చే జూన్ నుంచి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించనుంది. ప్రతి నెలా 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. ఇందుకు ఏటా 25వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని అంచనా. ఆ మేరకు రాగుల సేకరణకు టెండర్ జారీ చేసింది.