News April 6, 2025

ఎకనామిక్ గ్రోత్ రేట్‌.. రెండో స్థానంలో AP: మంత్రి లోకేశ్

image

ఎకనామిక్ గ్రోత్ రేట్(2024-25)లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నివేదికను పంచుకున్నారు. AP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) ₹8.73 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 9.69% గ్రోత్ రేటుతో TN తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో AP (8.21%), అస్సాం (7.94), రాజస్థాన్ (7.82), హరియాణా(7.55), ఛత్తీస్‌గఢ్ (7.51), TG (6.69) ఉన్నాయి.

Similar News

News April 22, 2025

రాజ్ కసిరెడ్డిని మరోసారి విచారించనున్న సిట్

image

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని కాసేపట్లో సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. నిన్న ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటు నుంచి విజయవాడకు తరలించిన అధికారులు తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణంలో కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశముంది.

News April 22, 2025

పోప్ డెత్ రిపోర్ట్‌లో ఏముందంటే?

image

పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చనిపోయేముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చాలని, ఇన్‌స్క్రిప్షన్‌పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.

News April 22, 2025

BREAKING: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

image

హీరో మహేశ్ బాబుకు ED నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ED సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేశ్ బాబు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది.

error: Content is protected !!