News April 6, 2025
తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: ఉత్తమ్

TG: కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయవిచారణకు తాను హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయబృందంతో ఆయన చర్చలు జరిపారు. ‘నీటి కేటాయింపులు సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్న నిర్ణయాలను సరిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశం కూడా వదులుకోం’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
Similar News
News April 17, 2025
ఆరు రోజుల పాటు వర్షాలు

TG: ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో రానున్న 6 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వానలు లేని ప్రాంతాల్లో రాబోయే 3రోజులు 2-3°C ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు పడతాయంది.
News April 17, 2025
రెండో పెళ్లి చేసుకున్న స్టార్ యాంకర్

ప్రముఖ తమిళ స్టార్ యాంకర్, బిగ్‌బాస్ సీజన్-5 రన్నరప్ ప్రియాంక దేశ్‌పాండే రెండో వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు వాసిని పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. బంధువులు, మిత్రుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. కాగా, 2016లో ప్రవీణ్ కుమార్‌ను పెళ్లాడగా ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో 2022లో విడిపోయారు. కాగా, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సౌత్ఇండియా టీవీ ప్రజెంటర్లలో ప్రియాంక ఒకరు.
News April 17, 2025
శాంసన్‌కు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?

DCతో మ్యాచులో RR కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యారు. పక్కటెముకల్లో నొప్పి రావడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడారు. అయితే మ్యాచ్ అనంతరం తాను ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు సంజూ స్పష్టం చేశారు. ఇవాళ స్కానింగ్ జరిగాక గాయం తీవ్రతపై స్పష్టత వచ్చే అవకాశముంది. RR తన తర్వాతి మ్యాచును ఈనెల 19న LSGతో ఆడనుంది. ఆలోగా సంజూ కోలుకునే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.