News April 7, 2025

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. 2,226 పాయింట్ల నష్టంతో sensex 73,137 పాయింట్ల వద్ద, 742 పాయింట్ల నష్టంతో nifty 22,161 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.16 లక్షల కోట్లు నష్టపోయారు. ట్రెంట్, టాటా స్టీల్, JSW స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎయిర్‌టెల్, AXIS, HDFC, ICICI, ITC షేర్లు భారీగా నష్టపోయాయి.

Similar News

News April 14, 2025

వేసవిలో ఈ జాగ్రత్తలు ముఖ్యం

image

ఎండాకాలంలో నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ప్రతిరోజూ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. మద్యం, కాఫీ, టీ, ధూమపానానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. మసాలాలు తగ్గిస్తే గ్యాస్‌ట్రబుల్‌ సమస్య దరిచేరదు. చికెన్‌, మటన్‌ తదితర నాన్‌వెజ్ వంటకాలకు దూరంగా ఉంటే బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. 2 పూటల స్నానం చేస్తే చెమట వల్ల వచ్చే ఫంగస్‌‌ సమస్యలను దూరం చేయొచ్చు.

News April 14, 2025

నేటి నుంచి ‘భూభారతి’

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. CM రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందువల్ల తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది.

News April 14, 2025

నేడు లక్నోతో చెన్నై ఢీ.. ఓడితే CSK ఇంటికే!

image

IPLలో ఇవాళ LSG, CSK తలపడనున్నాయి. ఇప్పటి వరకు వీటి మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా లక్నో మూడింటిలో గెలిచింది. ఓ మ్యాచ్‌లో CSK విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కూతురికి అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఆడిన 6 మ్యాచుల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న CSK ఇవాళ కూడా ఓడితే ఫ్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే.

error: Content is protected !!