News April 7, 2025
గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే?

బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్‌కు బాంబులు గుర్తించడం పని. రోనిన్ ఇప్పటివరకు భూమిలోని 109 ల్యాండ్‌మైన్లు, 15 బాంబులు గుర్తించింది. వాటి నుంచి కాపాడిన రోనిన్‌ను ఆ దేశ ప్రజలు హీరోగా కీర్తిస్తున్నారు. రోనిన్‌కు ముందు మగావా అనే ఎలుక 71 మైన్లు, 38 బాంబులు గుర్తించింది. దీంతో రోనిన్ అత్యధిక పేలుడు పదార్థాలను గుర్తించిన ఎలుకగా నిలిచింది.
Similar News
News April 11, 2025
పట్టుకున్న చేప ప్రాణం తీసింది!

చెన్నైలో చేపలు పడుతున్న ఓ వ్యక్తి, చేప వల్లే చనిపోయాడు. మణికందన్ అనే వ్యక్తి కీలావలంలోని చేపల చెరువులో రెండు చేపల్ని పట్టుకున్నారు. ఒకదాన్ని చేతితో, మరోదాన్ని నోటితో పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వస్తుండగా నోటితో పట్టుకున్న చేప ఆయన గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడే అది ఇరుక్కుపోవడంతో మణికందన్ విలవిల్లాడారు. స్థానికులు సాయం చేసేలోపే ప్రాణాలు విడిచారు.
News April 11, 2025
చైనా ప్రతిపాదన… ఆస్ట్రేలియా తిరస్కరణ

అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో వేరే దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆస్ట్రేలియాను తమకు కలిసిరావాలని కోరగా బీజింగ్‌కు చుక్కెదురైంది. అమెరికా సుంకాలపై ఉమ్మడిగా పోరాడదామంటూ చైనా ఇచ్చిన పిలుపును ఆస్ట్రేలియా తిరస్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చైనా చేతిని పట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తామని పేర్కొంది.
News April 11, 2025
14,956 ఎకరాల్లో పంట నష్టం!

TG: అకాల వర్షాల కారణంగా 14,956 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. వాటిలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటలున్నాయని పేర్కొంది. ఒక్క గత నెలలో వానలకే 8408 ఎకరాల పంట నేలవాలిందని పేర్కొంది. ఈ నెల 3 నుంచి 9 వరకు 7 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వానలు చేకూర్చిన నష్టంపై రూపొందించిన నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.