News April 11, 2025

చైనా ప్రతిపాదన… ఆస్ట్రేలియా తిరస్కరణ

image

అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో వేరే దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆస్ట్రేలియాను తమకు కలిసిరావాలని కోరగా బీజింగ్‌కు చుక్కెదురైంది. అమెరికా సుంకాలపై ఉమ్మడిగా పోరాడదామంటూ చైనా ఇచ్చిన పిలుపును ఆస్ట్రేలియా తిరస్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చైనా చేతిని పట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తామని పేర్కొంది.

Similar News

News April 20, 2025

సౌత్‌లో హీరోయిన్లను జూమ్ చేసి మరీ..: మాళవిక

image

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా దృష్టి పెడతారని హీరోయిన్ మాళవిక మోహన్ అన్నారు. నడుము ఒంపులు ఎక్కువగా ఉన్న హీరోయిన్లను వారు ఇష్టపడతారని చెప్పారు. ‘నేను ముంబైలో పెరిగా కాబట్టి నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు వారి శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

News April 20, 2025

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

image

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <>నోటిఫికేషన్ విడుదలైంది.<<>> జూన్ 10 నుంచి 18 వరకు బెంగళూరులో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. రేపటి నుంచి మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2005 జనవరి 1 నుంచి 2008 జులై 1 మధ్యలో జన్మించి, టెన్త్ పాసైన వారు అర్హులు.
వెబ్‌సైట్:https://agnipathvayu.cdac.in/

News April 20, 2025

హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్‌ సాయం కోరిన బంగ్లా

image

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!