News April 7, 2025

HCU విద్యార్థులపై కేసులు ఎత్తేయండి: భట్టి

image

TG: కంచ భూముల పరిరక్షణ కోసం నిరసనలు చేసిన HCU విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణలో న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. న్యాయశాఖ అధికారులు ఇందుకు తగిన సూచనలు చేయాలని వెల్లడించారు.

Similar News

News September 19, 2025

నేడు YCP ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం

image

AP: మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్‌ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

News September 19, 2025

CM రేవంత్ ఇవాళ్టి ఢిల్లీ షెడ్యూల్

image

ఢిల్లీ: CM రేవంత్ ఉ.11గం.కు తాజ్ ప్యాలెస్‌లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో సమావేశమవుతారు. ఉ.11:30గం.కు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్‌లో ప్రసంగిస్తారు. మ.12గం.కు అమెజాన్, కార్ల్స్ బర్గ్, గోద్రెజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులను పెట్టుబడులపై కలుస్తారు. మ.12:30గం.కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ప్రత్యేక భేటీ ఉంటుంది.

News September 19, 2025

భారత్-చైనాని ట్రంప్ భయపెట్టలేరు: రష్యా మంత్రి

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు భారత్-చైనాలను భయపెట్టలేకపోయాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ‘నాకు నచ్చనిది చేయకండి టారిఫ్స్ విధిస్తాను అన్న ధోరణి ప్రాచీన నాగరికత కలిగిన భారత్, చైనా విషయంలో పనిచేయదు. అమెరికాకు అది అర్థమవుతోంది. సుంకాలు వేస్తే ఆ దేశాలను ఇంధనం, మార్కెట్ వంటి రంగాల్లో ఆల్టర్నేటివ్స్ వైపు మళ్లిస్తాయి’ అని తెలిపారు.