News April 7, 2025
HCU విద్యార్థులపై కేసులు ఎత్తేయండి: భట్టి

TG: కంచ భూముల పరిరక్షణ కోసం నిరసనలు చేసిన HCU విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణలో న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. న్యాయశాఖ అధికారులు ఇందుకు తగిన సూచనలు చేయాలని వెల్లడించారు.
Similar News
News April 24, 2025
TODAY HEADLINES

* ఉగ్రదాడి బాధితులకు రూ.10లక్షల పరిహారం: చంద్రబాబు
* హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్
* పహల్‌గామ్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం
* ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
* తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
* భారీగా తగ్గిన బంగారం ధర
* IPLలో SRH ఘోర పరాజయం
News April 24, 2025
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: రామ్మోహన్

కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖ ఎయిర్‌పోర్టులో ఎంతో బాధతో స్వీకరించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చనిపోయిన వారికి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నివాళులు అర్పించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామన్నారు.
News April 24, 2025
భారత్ ఆరోపణలు.. పాక్ ప్రధాని రేపు కీలక భేటీ

పహల్‌గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని దాయాది దేశంపై భారత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న వేళ దాడులకు పాల్పడినట్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ రేపు నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తెలిపారు. భారత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారన్నారు.