News March 26, 2024
ఆరోగ్యమైన గుండె కోసం రోజూ 3600 అడుగులు

సాధారణ వేగంతో రోజుకు 3600 అడుగులు వేయడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం 26శాతం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. బఫెలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 63 నుంచి 99 ఏళ్ల మధ్య వయసు గల 6వేల మంది అమెరికన్ మహిళలపై అధ్యయనం చేశారు. ఏడున్నర ఏళ్ల పాటు అధ్యయనంలో భాగంగా నడిచిన 407 మంది హార్ట్ పేషంట్స్‌లో గుండె ఆగిపోయే ప్రమాదం తక్కువగా ఉందని తెలిసింది.
Similar News
News March 19, 2026
అదృష్టంగా మారిన దురదృష్టం.. పదేళ్లుగా ఫ్రీగా గ్యాస్!

కేరళం ఆలప్పుళకు చెందిన రెత్నమ్మ 2011లో నీటి కోసం బోరు తవ్వించారు. కానీ నీరు పడలేదు. బోరు పైపును క్లోజ్ చేసే సమయంలో ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించగా పైపు నుంచి మంటలు వచ్చాయి. దీనిని గ్యాస్‌లా వాడుకోవచ్చని రెత్నమ్మ ఆ పైపును కిచెన్‌కు కనెక్ట్ చేసుకున్నారు. పదేళ్లు పైగా దానిని వాడుతూ ఏడాదికి రూ.10వేలు సేవ్ చేస్తున్నారు. బోరు నుంచి వచ్చేది మీథేన్ అని, కానీ అక్కడ భూగర్భ నిల్వలు లేవని అధికారులు తేల్చారు.
News March 19, 2026
కేరళం సీఎం ఆస్తి ₹కోటి!

కేరళం సీఎం పినరయి విజయన్ ధర్మదమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశారు. తనకు ₹45లక్షల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, కన్నూర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ సహా పలు కంపెనీ షేర్లు ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఓ రెసిడెన్షియల్ ప్లాట్, వ్యవసాయ భూమి కలిపి ₹56లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే విజయన్‌పై ఆరు కేసులున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. <<-se>>#Elections2026<<>>
News March 19, 2026
రంజాన్ ఎల్లుండే..

భారత్‌లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.


