News April 9, 2025
ఇంటి నుంచే పనిచేస్తున్న ఢిల్లీ సీఎం రేఖ

ఢిల్లీ CMగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తయినా అధికారిక నివాసంపై నిర్ణయం తీసుకోలేదు. మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించిన బంగ్లాలోకి వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదు. షాలిమార్ బాగ్‌లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో VIPలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 25KM ప్రయాణించి ఆమె సచివాలయానికి వెళ్తున్నారు. సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్‌లో నివాసం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 28, 2026
‘బారామతి’తో అజిత్ పవార్‌కు విడదీయరాని బంధం

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. బారామతితో ఆయనకు విడదీయరాని బంధముంది. అక్కడి ప్రజలను ఆయన తన సొంతం కుటుంబంగా అభివర్ణిస్తుంటారు. 1991 నుంచి 2024 ఎన్నికల వరకు బారామతి ప్రజలు ఆయన వెనుకే నడిచారు. పవార్ vs పవార్ వార్(2024)లోనూ అక్కడి ప్రజలు అజిత్‌కు లక్ష మెజారిటీ కట్టబెట్టారు. బారామతి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అదే మట్టిలో కలిసిపోయారు.
News January 28, 2026
మేడారం జాతరలో బెల్లమే బంగారం.. ఎందుకంటే?

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. బంగారంతో సమానంగా చూస్తారు. అందుకే ‘నిలువెత్తు బంగారం’ అంటారు. కోరికలు తీరితే తమ బరువుకు సమానంగా తులాభారం వేసి సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు.
News January 28, 2026
వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో ఉద్యోగాలు

<


