News April 9, 2025
ఇంటి నుంచే పనిచేస్తున్న ఢిల్లీ సీఎం రేఖ

ఢిల్లీ CMగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తయినా అధికారిక నివాసంపై నిర్ణయం తీసుకోలేదు. మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించిన బంగ్లాలోకి వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదు. షాలిమార్ బాగ్‌లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో VIPలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 25KM ప్రయాణించి ఆమె సచివాలయానికి వెళ్తున్నారు. సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్‌లో నివాసం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Similar News
News April 20, 2025
ఆకాశంలో స్మైలీ.. 25న అద్భుతం

ఈ నెల 25న ఆకాశం మనల్ని నవ్వుతూ పలకరించనుంది. ఆ రోజున ఉ.5.30 సమయంలో శుక్రుడు, శని గ్రహాలు నెల వంకకు అతి చేరువగా రానున్నాయి. దీంతో త్రిభుజాకారంలో స్మైలీ ఫేస్ కనువిందు చేయనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. రెండు గ్రహాలు కాంతివంతంగా ఉంటాయి కాబట్టి కంటితోనే చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని తెలిపింది.
News April 20, 2025
GTకి గుడ్ న్యూస్.. త్వరలో స్టార్ ప్లేయర్ రీఎంట్రీ?

తొలి 2 మ్యాచ్‌ల తర్వాత వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లిపోయిన GT స్టార్ బౌలర్ కగిసో రబాడా త్వరలో తిరిగిరానున్నట్లు సమాచారం. మరో 10 రోజుల్లో అతను జట్టుతో చేరే అవకాశం ఉందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించారు. ప్రస్తుతం 5 విజయాలతో గుజరాత్ టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. రబాడా కూడా వస్తే బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.
News April 20, 2025
రూ.3,900 కోట్ల భూమిని కాపాడిన బాలుడి లెటర్!

TG: హైడ్రాకు ఓ బాలుడు రాసిన లేఖ రూ.3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. లంగర్‌హౌజ్‌కు చెందిన బాలుడు జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ సెంటర్ దగ్గర్లోని ఖాళీ స్థలంలో కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల నార్నె ఎస్టేట్స్ అనే సంస్థ అక్కడ కంచె ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టడంతో అతడు హైడ్రాకు లేఖ రాశాడు. అది ప్రభుత్వ భూమి అని గుర్తించిన హైడ్రా, అక్కడి 39 ఎకరాల భూమిని తాజాగా స్వాధీనం చేసుకుంది.