News April 9, 2025
చాహల్.. నీకోసం మేమున్నాం: RJ మహ్వాష్

PBKS ప్లేయర్ చాహల్‌కు మద్దతుగా అతని రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ RJ మహ్వాష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘కష్టసుఖాల్లో మన వాళ్ల కోసం ఓ బండరాయిలా ఉండి అండగా నిలవాలి. చాహల్ నీకోసం మేమందరం ఉన్నాం’ అంటూ నిన్న మ్యాచ్ అనంతరం ఆయనతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు. దానికి చాహల్ స్పందిస్తూ.. ‘మీరే నా వెన్నెముక! నన్ను ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు’ అని లవ్ సింబల్‌తో కామెంట్ చేశారు.
Similar News
News January 12, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

* ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.
News January 12, 2026
అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 12, 2026
మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.


