News April 9, 2025
చాహల్.. నీకోసం మేమున్నాం: RJ మహ్వాష్

PBKS ప్లేయర్ చాహల్‌కు మద్దతుగా అతని రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ RJ మహ్వాష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘కష్టసుఖాల్లో మన వాళ్ల కోసం ఓ బండరాయిలా ఉండి అండగా నిలవాలి. చాహల్ నీకోసం మేమందరం ఉన్నాం’ అంటూ నిన్న మ్యాచ్ అనంతరం ఆయనతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు. దానికి చాహల్ స్పందిస్తూ.. ‘మీరే నా వెన్నెముక! నన్ను ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు’ అని లవ్ సింబల్‌తో కామెంట్ చేశారు.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడి.. విశాఖ వాసి గల్లంతు?

AP: జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లోని బైసరీన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్లు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్ వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News April 23, 2025
అదానీ స్పెక్ట్రమ్‌తో ఎయిర్‌టెల్ డీల్

అదానీ డేటా నెట్‌వర్క్స్ 26GHz బ్యాండ్‌లోని 400 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వాడుకునేందుకు ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.212 కోట్లు చెల్లించింది. గుజరాత్, ముంబై, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులోని స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ వినియోగించుకుంటుంది. దీనివల్ల 5G వేగం, నెట్‌వర్క్ కెపాసిటీ పెరగనుంది. యూజర్లకు నాణ్యమైన సేవలు అందుతాయి.
News April 23, 2025
ఉగ్రదాడి వెనుక TRF.. దీని చరిత్ర ఇదే

J&K పహల్గామ్‌లో జరిగిన పాశవిక <<16183726>>ఉగ్రదాడి<<>> వెనుక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)’ ఉన్నట్లు సమాచారం. ఇది పాక్‌కు చెందిన లష్కర్ ఏ తొయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 AUGలో ఏర్పాటైంది. దీనికి షేక్ సాజిద్ కమాండర్, బాసిత్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని కేంద్రం 2023లో ఉగ్రసంస్థగా ప్రకటించింది. కాగా నిన్న జరిగిన దాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.