News April 9, 2025
తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం

తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ (104km) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.1,322కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 35 లక్షల పని దినాల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏడాదికి 4M టన్నుల సరకు రవాణాకు కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
Similar News
News September 14, 2025
ఒడిశా OAS పరీక్షల్లో టాపర్.. లంచం తీసుకుంటూ..

ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (OAS)-2019 టాపర్ అశ్విన్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశమైంది. 2021లో ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన అట్టడుగు వర్గాలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఆయనను తాజాగా రూ.15వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. టాపర్‌గా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
News September 14, 2025
అందుకే.. సాయంత్రం ఈ పనులు చేయొద్దంటారు!

సూర్యాస్తమయం తర్వాత వచ్చే సుమారు 45 నిమిషాల కాలాన్ని అసుర సంధ్య వేళ, గోధూళి వేళ అని అంటారు. ఈ సమయంలో శివుడు, పార్వతీ సమేతంగా తాండవం చేస్తాడని నమ్ముతారు. శివతాండవ వీక్షణానందంతో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. ఈ వేళలో ఆకలి, నిద్ర, బద్ధకం వంటి కోరికలు కలుగుతాయి. వీటికి లోనైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ వేళలో నిద్రపోవడం, తినడం, సంభోగం వంటి పనులు చేయొద్దని పెద్దలు చెబుతుంటారు.
News September 14, 2025
‘నానో బనానా’ మాయలో పడుతున్నారా?

‘నానో బనానా’ మాయలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌లో షేర్ చేయొద్దని TGSRTC MD సజ్జనార్ సూచించారు. ఒక్క క్లిక్‌తో బ్యాంకు ఖాతాల్లోని డబ్బంతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని ట్వీట్ చేశారు. ‘ట్రెండింగ్స్‌ల్లో మీ ఆనందాన్ని పంచుకోవచ్చు. కానీ భద్రతే తొలి ప్రాధాన్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ఫేక్ సైట్లలో పర్సనల్ డేటా అప్లోడ్ చేసేముందు ఆలోచించాలి. మీ డేటా.. మీ డబ్బు.. మీ బాధ్యత’ అని తెలిపారు.