News April 9, 2025
తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం

తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ (104km) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.1,322కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 35 లక్షల పని దినాల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏడాదికి 4M టన్నుల సరకు రవాణాకు కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
Similar News
News April 23, 2025
రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ

కాళేశ్వరం కమిషన్ రెండోదశ విచారణ రేపటినుంచి ప్రారంభంకానుంది. ఈ సారి దర్యాప్తులో భాగంగా గత ప్రభుత్వంలోని బాధ్యులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నెలతో కమిషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో మరో రెండు మాసాలు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటైంది.
News April 23, 2025
సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 44mm చుట్టుకొలత, 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్యసాయిబాబా చిత్రం, 1926 నంబర్ ఉంటుంది.
News April 23, 2025
దూబే మంచి మనసు.. 10 మందికి ఆర్థిక సాయం

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. రూ.70వేల చొప్పున పది మందికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. క్రీడల్లో రాణించాలంటే అధునాతన కిట్స్, నాణ్యమైన కోచింగ్ అవసరమని, అందుకే తన వంతు సాయం చేస్తున్నానని ఆయన తెలిపారు. TT, ఆర్చరీ, పారా అథ్లెటిక్స్, చెస్, క్రికెట్ తదితర రంగాల్లోని క్రీడాకారులకు ఈ డబ్బు అందనుంది.