News April 10, 2025
రేపు ఓటీటీలోకి ‘కోర్ట్’ మూవీ

చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ మూవీ రేపు ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, రోహిణి, ప్రియదర్శి, హర్ష్ రోషణ్, శ్రీదేవి, హర్షవర్ధన్, సాయి కుమార్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హీరో నాని నిర్మించడం విశేషం.
Similar News
News March 14, 2026
చిత్తూరు: పౌల్ట్రీ రైతులకు కష్టాలు!

చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పౌల్ట్రీ ఫారాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి వారిని కష్టాలు వీడటం లేదు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో కొద్దిరోజులు చికెన్ విక్రయాలు తగ్గిపోవడంతో నష్టపోయారు. యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. వారం రోజుల క్రితం డజన్ కోడిగుడ్ల రిటైల్ ధర రూ.72 ఉండగా ప్రస్తుతం అది రూ.66కు చేరుకుంది.
News March 14, 2026
రోహిత్‌కు హార్దిక్ వార్నింగ్?.. MI రియాక్షన్ ఇదే

ఈ ఏడాది IPL ప్రారంభానికి ముందు రోహిత్ శర్మకు MI కెప్టెన్ హార్దిక్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ స్పోర్ట్స్ అకౌంట్ ట్వీట్ చేసింది. హిట్ మ్యాన్ ప్రదర్శన సరిగా లేకపోతే సహించేది లేదని పాండ్య మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు పేర్కొంది. దీనిపై MI స్పందించింది. ‘ఏమైనా రాసుకోవచ్చు’ అనే అర్థంలో నవ్వుతున్న ఎమోజీని పోస్టు చేసింది. ఇలాంటి రూమర్స్‌ను పుట్టించడం సాధారణమై పోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 14, 2026
సులభంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు

LPG సిలిండర్ బుకింగ్ కోసం కాల్స్ కలవక ఇబ్బంది పడుతున్నారా? అయితే పెట్రోలియం శాఖ సూచించిన ఈ 5 సులభమైన పద్ధతులు పాటించండి. వినియోగదారులు WhatsApp, SMS/IVRS, మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా కేవలం ఒక <<19377800>>మిస్డ్‌కాల్<<>> ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. మీ గ్యాస్ ప్రొవైడర్‌ను బట్టి ఏయే నంబర్లు, యాప్ వాడాలో పైనున్న ఫొటోలో చెక్ చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి UPI యాప్స్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.


