News April 10, 2025

రేపు ఓటీటీలోకి ‘కోర్ట్’ మూవీ

image

చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ మూవీ రేపు ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, రోహిణి, ప్రియదర్శి, హర్ష్ రోషణ్, శ్రీదేవి, హర్షవర్ధన్, సాయి కుమార్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హీరో నాని నిర్మించడం విశేషం.

Similar News

News February 12, 2026

ALERT: ఈ లింక్స్ క్లిక్ చేయకండి!

image

వాలంటైన్స్ వీక్ పేరుతో వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’ వంటి లింక్‌లను క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి లేదా గ్రూపుల్లో వచ్చే లింక్స్‌ను నమ్మి వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దని సూచించారు. ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’లో 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.

News February 12, 2026

నార్త్ కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జు ఏ?

image

ఉత్తర కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఆమెను తన వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఆమె కీలక సైనిక పర్యటనల్లో పాల్గొనడం, విధాన నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News February 12, 2026

CEERIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(<>CEERI<<>>) 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 26 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, టెన్త్+ITI, MSc(ఎలక్ట్రానిక్స్), ME/MTech, డిగ్రీ(అగ్రికల్చరల్ సైన్స్), BVSc, బీఫార్మసీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ceeri.res.in/