News April 10, 2025
పోసాని క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ

AP: నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. తనపై నెల్లూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని దానిని క్వాష్ చేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Dy.CM పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఆయన బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.
Similar News
News April 18, 2026
తండ్రయిన రషీద్ ఖాన్

అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రయ్యారు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. చిన్నారికి అజ్లాన్ ఖాన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.
News April 18, 2026
అత్యాచారాలు చేసేవారిపై కాకుండా ప్రశ్నించే వారిపై కేసులా: YS జగన్

AP: ప్రశ్నించే గొంతుకలకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేస్తోందని జగన్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అక్రమ కేసు పెట్టడానికి, ఇంట్లో సోదాలు చేయడానికి అతనేమైనా ఉగ్రవాదా? అని మండిపడ్డారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.
News April 18, 2026
భారత నౌకలపై IRGC కాల్పులు!

హార్ముజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై IRGC కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అందులో ఒకటి 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ఆయిల్‌తో వెళ్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ రెండు భారత షిప్పులు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. నౌకలతో పాటు అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.


