News April 10, 2025

పోసాని క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ

image

AP: నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. తనపై నెల్లూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని దానిని క్వాష్ చేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Dy.CM పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఆయన బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

Similar News

News April 21, 2025

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

image

ఇండియన్ షేర్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతుంది. ఉదయం 518 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 939 పాయింట్లు పెరిగి 79,492 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 329 పాయింట్లు లాభపడి 24,158 వద్ద కొనసాగుతోంది. టాటా, ఐడియా, HDFC, ఏంజిల్ వన్ కంపెనీలు టాప్ గైనర్‌లుగా ఉన్నాయి.

News April 21, 2025

రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి

image

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజ్‌ను విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈక్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణను న్యాయస్థానం వచ్చేవారానికి వాయిదా వేసింది.

News April 21, 2025

JEE MAINS.. ఒకే గ్రామంలో 40 మంది పాస్!

image

సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్‌లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్‌లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితంగా కోచింగ్ ఇస్తోన్న ‘వృక్ష సంస్థాన్’ నుంచి 28 మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఇంటికో ఇంజినీర్ ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రతిచోట ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

error: Content is protected !!