News April 10, 2025
మార్స్‌ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి: సైంటిస్ట్

అంగారక గ్రహంపై నివాసానికి పోలిష్ అకాడమీ శాస్త్రవేత్త ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. అంగారక గ్రహాన్ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి అని సూచించారు. తద్వారా అక్కడ మనిషి జీవించడానికి అవసరమైన వాయువులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మార్స్‌పై CO2 అధికంగా ఉండటంతో దానిపై మనుషులు జీవించడం సాధ్యపడదు. ఊర్ట్ క్లౌడ్‌లోని ఓ మంచు గ్రహశకలం అంగారకుని దగ్గరికి చేరుకోవాలంటే 15వేల సంవత్సరాలు పడుతుందట.
Similar News
News April 19, 2025
10 రోజుల్లో రూ.4,200 పెరిగిన గోల్డ్ రేటు

శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత పది రోజుల్లోనే తులం బంగారంపై రూ.4,200లు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అయితే, మూడు రోజులకే టారిఫ్స్ హోల్డ్ చేయడంతో రాకెట్లా దూసుకెళ్లాయి. ఈనెల 10న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,380 ఉండగా ఇవాళ అది రూ.97,580కి చేరింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.89,450గా ఉంది.
News April 19, 2025
పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని హీరోయిన్ త్రిష అన్నారు. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. కాగా త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లోనూ ఆమె కనిపించనున్నారు.
News April 19, 2025
మామిడి పండ్లు తింటున్నారా?

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తుచ్చేది మామిడి పండ్లే. అయితే, కార్బైడ్‌తో మాగించిన పండ్లను తింటే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత మంచినీటితో కడిగి, ఆపై తుడిచి తినాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తొక్కను తినకపోవడమే బెటర్ అని చెబుతున్నారు. కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిదంటున్నారు.