News April 10, 2025

చంద్రబాబు గారూ.. రొయ్యల రేటు ఎందుకు పెరగడం లేదు?: జగన్

image

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశాలు ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలని YS జగన్ అన్నారు. ‘రొయ్యలకు వేసే మేతపై సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. సోయాబీన్‌ రేటు కిలోకు రూ.105 నుంచి రూ.25కి పడిపోయింది. ముడిసరకుల రేట్లు పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు ఎందుకు తగ్గడం లేదు? US టారిఫ్స్ వాయిదా పడినా అక్కడికి ఎగుమతయ్యే రొయ్యల ధర ఎందుకు పెరగడం లేదు’ అని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Similar News

News December 25, 2025

వాజ్‌పేయి ఒక యుగ పురుషుడు: చంద్రబాబు

image

AP: దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్‌పేయి అని CM చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో సుపరిపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు ఇది. విగ్రహంతో పాటు ఆయన చరిత్ర ప్రజలకు గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటు చేస్తాం. ఈ శత జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం సంతోషంగా ఉంది. దేవతల రాజధాని అమరావతికి ఒక నమూనాగా ఈ ప్రజా రాజధాని అమరావతిని నిలబెట్టాలన్నదే నా ధ్యేయం’ అని తెలిపారు.

News December 25, 2025

జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించే సింపుల్ చిట్కాలు!

image

జంక్ ఫుడ్ తినాలనే కోరిక మెదడు పనితీరు, ఒత్తిడి, నిద్రలేమితో ముడిపడి ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తినాలి. రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి జంక్ ఫుడ్ వైపు మనసు మళ్లదు. ఒత్తిడి తగ్గించుకోవడం, కంటినిండా నిద్ర, నీళ్లు బాగా తాగడం, ఫుడ్ బాగా నమిలి తింటే క్రేవింగ్స్ అదుపులో ఉంటాయి. స్నాక్స్‌గా పండ్లు, డ్రై ఫ్రూట్స్ బెస్ట్.

News December 25, 2025

వంటింటి చిట్కాలు

image

* ఖీర్, పాయసం లాంటివి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* పకోడీలు కరకరలాడకపోతే బజ్జీల పిండిలో ఒకట్రెండు చెంచాల బియ్యప్పిండి కలిపి చూడండి.
* సెనగలను ఉడికించిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి వాడితే పోషకాలు అందుతాయి.