News April 10, 2025
చంద్రబాబు గారూ.. రొయ్యల రేటు ఎందుకు పెరగడం లేదు?: జగన్

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశాలు ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలని YS జగన్ అన్నారు. ‘రొయ్యలకు వేసే మేతపై సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. సోయాబీన్ రేటు కిలోకు రూ.105 నుంచి రూ.25కి పడిపోయింది. ముడిసరకుల రేట్లు పడిపోయినప్పుడు ఫీడ్ రేట్లు ఎందుకు తగ్గడం లేదు? US టారిఫ్స్ వాయిదా పడినా అక్కడికి ఎగుమతయ్యే రొయ్యల ధర ఎందుకు పెరగడం లేదు’ అని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
Similar News
News April 22, 2025
నేడు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ

AP: యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై చర్చిస్తారు. ఇది బీజేపీకే దక్కనుందని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌తోనూ ఆయన సమావేశమవుతారు.
News April 22, 2025
నటన నా రక్తంలోనే ఉంది.. త్వరలోనే రీఎంట్రీ: రంభ

తన పిల్లల కోసమే సినిమాలకు దూరమయ్యానని అలనాటి హీరోయిన్ రంభ వెల్లడించారు. ఇప్పుడు కుమార్తెలకు 14, 10 ఏళ్లు, కుమారుడికి 6 ఏళ్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి 15 ఏళ్లు దూరమైనా నటన తన రక్తంలోనే ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
News April 22, 2025
మతిమరుపు ఎక్కువవుతోందా.. కారణం అదే కావొచ్చు!

శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్-కె అందనివారిలో మతిమరుపు సమస్యలు ఎక్కువవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘దెబ్బ తగిలిన చోట రక్తాన్ని గడ్డ కట్టించడం నుంచి ఎముకలు, మెదడు ఆరోగ్యం వరకు విటమిన్-కె చాలా కీలకం. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. చురుకుగా ఆలోచించడానికి, మెరుగైన జ్ఞాపకశక్తికి పాలకూర, బ్రకోలీ, క్యాబేజీ, పాలు, గుడ్లు, పళ్లు వంటివి పుష్కలంగా తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.