News April 10, 2025
3 రోజులకు రూ.25 కోట్లు.. నో చెప్పిన ప్రభాస్!

పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ ఉన్నా ప్రభాస్ యాడ్స్‌లో కనిపించేది చాలా తక్కువే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బాహుబలికి ఓ బ్రాండ్ యాడ్‌లో నటించాలని ఆఫర్ వచ్చిందట. 3 రోజులు కేటాయిస్తే రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేయగా ప్రభాస్ సింపుల్‌గా నో చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రాలతో డార్లింగ్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
‘మిరాయ్’లో రాముడి రోల్ చేసింది ఎవరంటే?

‘మిరాయ్’లో రాముడి పాత్ర AIతో రూపొందించలేదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ క్యారెక్టర్‌లో బాలీవుడ్ నటుడు గౌరవ్ బోరా కనిపించారని పేర్కొన్నాయి. హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ చేసిన డెహ్రడూన్‌కు చెందిన ఈ యాక్టర్ పలు కమర్షియల్ యాడ్స్‌లోనూ కనిపించారు. అయితే మూవీలో ఫేస్‌ను రివీల్ చేయకుండా డైరెక్టర్ కార్తీక్ జాగ్రత్తపడ్డారు. అంతకుముందు ఈ రోల్ <<17686798>>ప్రభాస్<<>> కనిపించారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్

అమెరికాలో భారతీయుడి <<17690207>>తల నరికివేసిన<<>> ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘క్యూబాకు చెందిన అక్రమ వలసదారు భార్యాబిడ్డల ముందే చంద్ర నాగమల్లయ్యను కిరాతకంగా చంపేశాడు. అతడు గతంలో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతడిని క్యూబా తమ దేశంలోకి తీసుకునేందుకు నిరాకరించింది. బైడెన్ అసమర్థతతో జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరస్థుడిని కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులను వదలం’ అని హెచ్చరించారు.
News September 15, 2025
స్పీకర్‌కు అభ్యంతరాలు తెలపనున్న BRS నేతలు

TG: పార్టీ ఫిరాయింపుల నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై అభ్యంతరాలు తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలవనున్నారు. ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలుంటే మూడ్రోజుల్లోగా తెలపాలని సూచించిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించిన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇవాళ మరిన్ని ఆధారాలు సమర్పించాలని నిర్ణయించింది. నోటీసులు అందుకున్న MLAల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణ అందజేయాల్సి ఉంది.