News April 10, 2025
3 రోజులకు రూ.25 కోట్లు.. నో చెప్పిన ప్రభాస్!

పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ ఉన్నా ప్రభాస్ యాడ్స్‌లో కనిపించేది చాలా తక్కువే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బాహుబలికి ఓ బ్రాండ్ యాడ్‌లో నటించాలని ఆఫర్ వచ్చిందట. 3 రోజులు కేటాయిస్తే రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేయగా ప్రభాస్ సింపుల్‌గా నో చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రాలతో డార్లింగ్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది.
Similar News
News April 13, 2026
రాకా: సైన్స్ ఫిక్షన్+ మైథాలజీ?

అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్ లుక్ మూవీపై హైప్‌ను పెంచింది. ఈ చిత్రంపై ఓ క్రేజీ బజ్ వైరలవుతోంది. ఇందులో సైన్స్ ఫిక్షన్‌తోపాటు మైథాలజీని కూడా టచ్ చేసినట్లు సమాచారం. తోడేళ్లకు సంబంధించి పురాణాల్లో ఉన్న ఆసక్తికర అంశాలను ఈ సినిమాలో మిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా దీపికా పదుకొణె, రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.
News April 13, 2026
PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
News April 13, 2026
చర్చలు విఫలం.. మార్కెట్లలో బ్లడ్‌బాతేనా?

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, క్రూడాయిల్ ధర పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. యుద్ధం ఇంకా కొనసాగనుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ నిక్కీ-225.. 0.80%, టోపిక్స్ 0.42% నష్టపోయాయి. సౌత్ కొరియా కోప్సి 1.83%, కొస్దాక్ 1.43%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్, ఆస్ట్రేలియా S&P/ASX 200 మైనస్‌లో ట్రెండ్ అవుతున్నాయి.


