News March 27, 2024

103 సిట్టింగ్‌లకు నో టికెట్

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటిదాకా బీజేపీ 405 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో 103 మంది సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించింది. పూర్తి జాబితా వచ్చేసరికి ఈ సంఖ్య పెరగొచ్చు. గత ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరించినప్పటికీ BJP 300కు పైగా సీట్లను గెలుచుకుంది. ఈ సారి ఏకంగా 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా.. అభ్యర్థుల మార్పు ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

Similar News

News February 3, 2026

టారిఫ్‌ల తగ్గింపుతో ఆక్వా రైతులకు ఆదాయం: అచ్చెన్న

image

AP: అమెరికా టారిఫ్‌లను 25 నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల ఆక్వా రంగానికి ఉపశమనం లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ దేశానికి సముద్ర ఆహార ఎగుమతులు 15% వరకు పెరుగుతాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో సీ ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందిస్తాయని తెలిపారు. దీంతో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

News February 3, 2026

చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

image

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

News February 3, 2026

మెడపై పర్‌ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నారా?

image

చాలామందికి మెడ మీద పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమంటున్నారు వైద్యులు. ఈ అలవాటు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నరు. మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి చర్మంపై మంట, దురద, నల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనిలోని రసాయనాలు థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. అందుకే నేరుగా చర్మంపై దుస్తులపై స్ప్రే చేసుకోవడం బెటర్.