News April 11, 2025

రిజల్ట్స్@W2N: సూపర్ ఫాస్ట్.. సేఫెస్ట్

image

సైట్లతో పోలిస్తే Way2Newsలో పరీక్షా ఫలితాలు సూపర్‌ఫాస్ట్‌గా వస్తాయి. సైట్లలో యాడ్స్ మధ్య రిజల్ట్ ట్యాబ్ ఎక్కడ ఉందో వెతికే ఇబ్బంది, ఆ బటన్‌పై క్లిక్ చేస్తే వెనకాల లోడ్ అయ్యే ప్రమాదకర లింక్స్ తలనొప్పులు ఇక్కడ ఉండవు. ప్రభుత్వం ఫలితాలు ప్రకటించగానే Way2News ఓపెన్ చేస్తే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇవ్వండి. సెకన్లలో రిజల్ట్ వస్తుంది. మరో క్లిక్ చేస్తే మీ స్కోర్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. అంతే!

Similar News

News January 16, 2026

Money Tip: మీకు మీరే శిక్ష వేసుకోండి.. వినూత్న పొదుపు మంత్రం!

image

మీకున్న చెడు అలవాట్లపై మీరే పన్ను వేసుకోండి. డబ్బు ఆదా చేయడానికి ఇదొక వినూత్న మార్గం. అనవసర ఖర్చు చేసినప్పుడు అంతే మొత్తాన్ని పెనాల్టీగా మీ సేవింగ్స్‌ అకౌంట్‌లోకి డిపాజిట్ చేయండి. Ex ఒక బర్గర్ కొంటే దానికి సమానమైన డబ్బును వెంటనే అకౌంట్‌కు మళ్లించాలి. ఇలా చేస్తూ వెళ్తే పోగైన డబ్బును బట్టి మీకున్న బ్యాడ్ హాబిట్స్ వల్ల ఎంత నష్టమో తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ అలవడుతుంది. పొదుపు అలవాటవుతుంది.

News January 16, 2026

అధిక పోషకాల పంట ‘ఎర్ర బెండ’

image

సాధారణంగా దేశీయ బెండ(లావుగా, పొట్టిగా), హైబ్రిడ్ బెండ రకాలు ఆకుపచ్చగా (లేదా) లేత ఆకుపచ్చగా ఉండటం గమనిస్తాం. కానీ ఎర్ర బెండకాయలను కూడా సాగు చేస్తారని తెలుసా. ‘ఆంతో సయనిన్’ అనే వర్ణ పదార్థం వల్ల ఈ బెండ కాయలు, కాండం, ఆకు తొడిమెలు, ఆకు ఈనెలు ఎర్రగా ఉంటాయి. ఆకుపచ్చ బెండ కంటే వీటిలో పోషకాల మోతాదు ఎక్కువ. ఎర్ర బెండలో ‘కాశి లాలిమ’, ‘పూసా రెడ్ బెండి-1’ రకాలు అధిక దిగుబడినిస్తాయి.

News January 16, 2026

PCOSకి చెక్ పెట్టే చియా సీడ్స్

image

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.