News April 11, 2025
రిజల్ట్స్@W2N: సూపర్ ఫాస్ట్.. సేఫెస్ట్

సైట్లతో పోలిస్తే Way2Newsలో పరీక్షా ఫలితాలు సూపర్‌ఫాస్ట్‌గా వస్తాయి. సైట్లలో యాడ్స్ మధ్య రిజల్ట్ ట్యాబ్ ఎక్కడ ఉందో వెతికే ఇబ్బంది, ఆ బటన్‌పై క్లిక్ చేస్తే వెనకాల లోడ్ అయ్యే ప్రమాదకర లింక్స్ తలనొప్పులు ఇక్కడ ఉండవు. ప్రభుత్వం ఫలితాలు ప్రకటించగానే Way2News ఓపెన్ చేస్తే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇవ్వండి. సెకన్లలో రిజల్ట్ వస్తుంది. మరో క్లిక్ చేస్తే మీ స్కోర్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. అంతే!
Similar News
News April 18, 2025
గర్భిణిని కాపాడిన ChatGPT

నార్త్ కరోలినాలోని(USA) షార్లెట్‌కు చెందిన నటాలియా టారియన్ అనే 8 నెలల గర్భిణికి ChatGPT చేసిన హెచ్చరిక ఆమె ప్రాణాలను కాపాడేలా చేసింది. తన దవడ బిగుతుగా అనిపిస్తోందని ఇందుకు కారణమేంటని నటారియా ChatGPTని అడగ్గా ఆమె బీపీని చెక్ చేసుకోవాలని తెలిపింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలని Ai సూచించింది. ఆస్పత్రిలో బీపీ 200/146గా ఉండటంతో వెంటనే ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు.
News April 18, 2025
సిట్ విచారణకు విజయసాయి హాజరు

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కాసేపటి కిందటే విజయవాడలోని సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ఆయన అధికారులకు ఏం చెప్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ స్కామ్‌కు కసిరెడ్డి రాజశేఖరే కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో సాక్షిగా విచారించేందుకు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది.
News April 18, 2025
విక్రమ్ ‘వీర ధీర శూర’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుందని తెలిపింది. అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా గత నెల 27న థియేటర్లలో విడుదలైంది.