News April 11, 2025
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

ఆండ్రాయిడ్, IOS యూజర్లకు వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇక నుంచి గ్రూపు సభ్యుల్లో ఎంత మంది ఆన్‌లైన్‌లో ఉన్నారో నంబర్ రూపంలో (EX: 5) కనిపిస్తుంది. అలాగే గ్రూపులో ప్రతీ మెసేజ్‌కు కాకుండా మనల్ని ఎవరైనా మెన్షన్ చేస్తే లేదా మన మెసేజ్‌కు రిప్లై ఇస్తే మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. అటు ఐఫోన్లలో డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపించే ఆప్షన్‌నూ యాడ్ చేసింది.
Similar News
News November 12, 2025
ఏపీ ఎడ్యుకేషన్&జాబ్స్ న్యూస్

* MBBS బీ, సీ కేటగిరీ సీట్లకు మూడో దశకు కౌన్సెలింగ్‌కు ఇవాళ సా.4 గంటల్లోపు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
* జర్మనీకి చెందిన యూరోప్ కెరీర్స్‌తో APSSDC, ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా యూరోప్ సంస్థ ఏపీ యువతకు జర్మన్ భాషలో శిక్షణ, ఉద్యోగాలను అందిస్తుంది. జాబ్ కాంట్రాక్ట్, వీసా సమకూర్చడానికి సాయం చేస్తుంది.
News November 12, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేట్

గత రెండు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.330 తగ్గి రూ.1,25,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 దిగివచ్చి రూ.1,15,050గా నమోదైంది. అటు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.3వేలు పెరిగి రూ.1,73,000కు చేరింది.
News November 12, 2025
హీరోగా మారిన డైరెక్టర్.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

<<18171965>>హీరో అవతారమెత్తిన<<>> కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సరికొత్త ఘనత సాధించినట్లు టాక్. దర్శకుడిగా ₹50Cr రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన.. కథానాయకుడిగా తొలి మూవీకే ₹30Cr వరకు అందుకుంటున్నట్లు సమాచారం. ఇదొక రికార్డని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేశ్ ప్రధాన పాత్రలో ‘DC’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలతో ఆయన స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.


