News April 11, 2025

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

image

ఆండ్రాయిడ్, IOS యూజర్లకు వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇక నుంచి గ్రూపు సభ్యుల్లో ఎంత మంది ఆన్‌లైన్‌లో ఉన్నారో నంబర్ రూపంలో (EX: 5) కనిపిస్తుంది. అలాగే గ్రూపులో ప్రతీ మెసేజ్‌కు కాకుండా మనల్ని ఎవరైనా మెన్షన్ చేస్తే లేదా మన మెసేజ్‌కు రిప్లై ఇస్తే మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. అటు ఐఫోన్లలో డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపించే ఆప్షన్‌నూ యాడ్ చేసింది.

Similar News

News April 14, 2026

చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు రేవంత్ లేఖ

image

దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపుపై కలిసి పోరాడుదామని కోరారు. కేంద్రం చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు <<19651062>>అన్యాయం<<>> జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు. నియోజకవర్గాల పెంపులో హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

News April 14, 2026

గ్రాము బంగారానికి ₹11వేల లాభం!

image

2019 OCT 15న ఇష్యూ అయిన సిరీస్-5 సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ రేపటి నుంచి చేసుకోవచ్చని RBI ప్రకటించింది. అప్పుడు గ్రాము ధర ₹3,738 ఉంటే ఇప్పుడు ₹15,009కు (₹11,271 లాభం) చేరింది. ఏప్రిల్ 9, 10, 13 తేదీల్లో గోల్డ్ ప్రైస్ యావరేజ్ ఆధారంగా RBI దీనిని డిసైడ్ చేసింది. మొత్తంగా 302% ప్రాఫిట్.. అంటే ₹లక్ష పెట్టిన వారికి ₹4లక్షలు వస్తాయి. ఇది కాక ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా యాడ్ అవుతుంది.

News April 14, 2026

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

image

Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ఆయన సినిమాలకు సంబంధించి రెండు స్పెషల్ అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి టీజర్ వస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై అఫీషియల్ ప్రకటన, స్పెషల్ పోస్టర్ రానున్నట్లు పేర్కొన్నాయి. అదే రోజున ‘దేవర-2’పైనా మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.