News April 11, 2025
అసలేంటీ కోనోకార్పస్ చెట్లు? ఎందుకింత చర్చ?

కోనోకార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతానికి చెందిన మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈ మొక్కను ప్లాంటేషన్ నిపుణులు INDకు తెచ్చారు. చూడటానికి గుబురుగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఈ చెట్లు <<16065381>>పర్యావరణ<<>>, ఆరోగ్య సమస్యలకు కారకాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వేర్లు లోతుగా వెళ్లి తాగునీరు వ్యవస్థలు, భవనాలను సైతం దెబ్బతీస్తాయంటున్నారు. ఈ చెట్లు అందం కోసం తప్పితే మరెందుకూ పనికిరావనేది వారి వాదన.
Similar News
News September 15, 2025
బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ కమిటీలో జహీరాబాద్ ఎంపీ కుమార్తె

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మీడియా, పబ్లిసిటీ ఛైర్మన్ పవన్ ఖేరా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించారు. బెంగాల్ ఎన్నికల కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కుమార్తె గిరిజా షెట్కార్(పరిశోధన)ను పశ్చిమ బెంగాల్ మీడియా కోఆర్డినేటర్ కేటాయించారు.
News September 15, 2025
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

* <<17714335>>వక్ఫ్<<>> భూముల ఆక్రమణపై కలెక్టర్‌దే తుది నిర్ణయమన్న ప్రొవిజన్‌పై SC స్టే విధించింది. ట్రిబ్యునల్/కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలంది.
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరుల సంఖ్య 4, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 3కు మించొద్దని చెప్పింది.
* స్టేట్ బోర్డుకు నాన్-ముస్లిం CEO కావొచ్చన్న ప్రొవిజన్‌పై స్టే విధించలేదు. కానీ వీలైనంత వరకు ముస్లింనే నియమించాలంది.
* రిజిస్ట్రేషన్ రూల్‌లో కోర్టు జోక్యం చేసుకోలేదు.
News September 15, 2025
‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.