News April 11, 2025
అసలేంటీ కోనోకార్పస్ చెట్లు? ఎందుకింత చర్చ?

కోనోకార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతానికి చెందిన మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈ మొక్కను ప్లాంటేషన్ నిపుణులు INDకు తెచ్చారు. చూడటానికి గుబురుగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఈ చెట్లు <<16065381>>పర్యావరణ<<>>, ఆరోగ్య సమస్యలకు కారకాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వేర్లు లోతుగా వెళ్లి తాగునీరు వ్యవస్థలు, భవనాలను సైతం దెబ్బతీస్తాయంటున్నారు. ఈ చెట్లు అందం కోసం తప్పితే మరెందుకూ పనికిరావనేది వారి వాదన.
Similar News
News April 11, 2026
టీ కొట్టు నుంచి మాల్స్ వరకు.. ‘UPI’కి పదేళ్లు!

ఇండియన్ డిజిటల్ పేమెంట్స్‌కు చిరునామాగా మారిన UPIకి నేటితో పదేళ్లు. 2016లో NPCI ప్రారంభించిన ఈ వ్యవస్థ నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా యూజర్లు, 504 బ్యాంకులు, 6.5 కోట్ల మంది వ్యాపారులతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ పేమెంట్ వ్యవస్థగా అవతరించింది. టీ కొట్టు నుంచి మాల్స్ వరకు ప్రతిచోటా ఫోన్ ద్వారా సులభంగా డబ్బులు పంపేలా UPI మన జీవితాలను మార్చేసింది.
News April 11, 2026
రిస్కీ రీఎంట్రీ: 40,000kmph వేగం.. 2,760°C టెంపరేచర్

ఆర్టెమిస్-2 మిషన్‌లో రీఎంట్రీ అత్యంత రిస్కీ పార్ట్. 40,000kmph స్పీడ్‌తో భూవాతావరణంలోకి క్యాప్సూల్ దూసుకొచ్చింది. అప్పుడు పుట్టిన 2,760°C వేడికి ఓరియన్ క్యాప్సూల్ చుట్టూ ఎర్రటి ప్లాస్మా సెగలు కమ్మేశాయి. అప్పుడే 6 నిమిషాలు కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో హ్యూస్టన్ కంట్రోల్ రూమ్‌లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. హీట్ షీల్డ్ ప్రాణాలు కాపాడగా పారాచూట్లు విచ్చుకుని వ్యోమగాములు సేఫ్‌గా దిగడంతో రిలీఫ్ అయ్యారు.
News April 11, 2026
సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.


