News April 12, 2025

15 నుంచి రాష్ట్రంలో చేపల వేట నిషేధం

image

AP: ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరబోట్లు, మెకనైజ్డ్, మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీవో నం.129 విడుదల చేశారు.

Similar News

News March 20, 2026

మార్చి 20: చరిత్రలో ఈ రోజు

image

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం

News March 20, 2026

తండ్రి అయిన RCB కెప్టెన్

image

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గుంజన్ పండంటి మగ బిడ్డకు నిన్న జన్మనిచ్చారు. దీంతో IPL ప్రారంభానికి వారం రోజుల ముందే వారి ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండర్‌కు చెందిన పాటీదార్ 2022లో గుంజన్‌ను వివాహమాడారు. మరోవైపు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా <<19424001>>ఉగాది రోజునే<<>> మరోసారి తండ్రయ్యారు. దినేశ్, పాటీదార్ ఒకేరోజు పుట్టడం(జూన్ 1) విశేషం.

News March 20, 2026

ఇరాన్‌తో యుద్ధం కోసం ₹18 లక్షల కోట్లు!

image

ఇరాన్‌తో యుద్ధం కొనసాగించేందుకు $200 బిలియన్లు(₹18 లక్షల కోట్లు) కావాలని US కాంగ్రెస్‌ను పెంటగాన్ కోరినట్లు తెలుస్తోంది. ఇది ఇరాన్ ఎకానమీ($356B)లో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. యుద్ధం మొదలైన తొలి వారంలోనే US $11B పైగా ఖర్చు చేసింది. ‘$200B అంటే చిన్న మొత్తమే. US ఎకానమీని దెబ్బతీస్తున్న ఇజ్రాయెల్ PM నెతన్యాహుకు అమెరికన్లు థాంక్స్ చెప్పాలి’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఎద్దేవా చేశారు.