News April 12, 2025

IPL: రిషభ్ పంత్ మళ్లీ విఫలం

image

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ మళ్లీ విఫలమయ్యారు. ఈసారి ఓపెనింగ్‌ స్థానంలో వచ్చినా ఆయన ఆట మారలేదు. GTతో జరుగుతున్న మ్యాచులో పంత్ 18 బంతులాడి 21 పరుగులే చేశారు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచుల్లో 0, 15, 2, 2, DNB, 21తో తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సీజన్‌లో ఆయన స్థాయికి తగ్గట్లు ఒక్క మ్యాచులో కూడా రాణించలేదు. కనీసం నెక్ట్స్ మ్యాచులోనైనా బ్యాట్ ఝుళిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News April 13, 2025

16న జపాన్ పర్యటనకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది.

News April 13, 2025

తిలక్ ఫిఫ్టీ.. ముంబై భారీ స్కోర్

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. ఓవర్లన్నీ ఆడి 205/5 పరుగులు చేసింది. హైదరాబాదీ తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశారు. రికెల్‌టన్ (41), సూర్యకుమార్ (40), నమన్ (38) రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ ఓ వికెట్ పడగొట్టారు. ఢిల్లీ టార్గెట్ 206 పరుగులు.

News April 13, 2025

BSPలోకి మాయావతి మేనల్లుడు రీఎంట్రీ

image

తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు BSP అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఆకాశ్ తన తప్పులను బహిరంగంగా ఒప్పుకున్నందుకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. తన వారసులుగా ఎవరినీ ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆనంద్ X వేదికగా మాయావతికి క్షమాపణలు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కొన్ని రోజుల క్రితం ఆయనను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు.

error: Content is protected !!