News April 12, 2025
IPL: రిషభ్ పంత్ మళ్లీ విఫలం

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ మళ్లీ విఫలమయ్యారు. ఈసారి ఓపెనింగ్ స్థానంలో వచ్చినా ఆయన ఆట మారలేదు. GTతో జరుగుతున్న మ్యాచులో పంత్ 18 బంతులాడి 21 పరుగులే చేశారు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచుల్లో 0, 15, 2, 2, DNB, 21తో తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సీజన్‌లో ఆయన స్థాయికి తగ్గట్లు ఒక్క మ్యాచులో కూడా రాణించలేదు. కనీసం నెక్ట్స్ మ్యాచులోనైనా బ్యాట్ ఝుళిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News April 14, 2026
చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు రేవంత్ లేఖ

దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపుపై కలిసి పోరాడుదామని కోరారు. కేంద్రం చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు <<19651062>>అన్యాయం<<>> జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు. నియోజకవర్గాల పెంపులో హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
News April 14, 2026
గ్రాము బంగారానికి ₹11వేల లాభం!

2019 OCT 15న ఇష్యూ అయిన సిరీస్-5 సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ రేపటి నుంచి చేసుకోవచ్చని RBI ప్రకటించింది. అప్పుడు గ్రాము ధర ₹3,738 ఉంటే ఇప్పుడు ₹15,009కు (₹11,271 లాభం) చేరింది. ఏప్రిల్ 9, 10, 13 తేదీల్లో గోల్డ్ ప్రైస్ యావరేజ్ ఆధారంగా RBI దీనిని డిసైడ్ చేసింది. మొత్తంగా 302% ప్రాఫిట్.. అంటే ₹లక్ష పెట్టిన వారికి ₹4లక్షలు వస్తాయి. ఇది కాక ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా యాడ్ అవుతుంది.
News April 14, 2026
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ఆయన సినిమాలకు సంబంధించి రెండు స్పెషల్ అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి టీజర్ వస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై అఫీషియల్ ప్రకటన, స్పెషల్ పోస్టర్ రానున్నట్లు పేర్కొన్నాయి. అదే రోజున ‘దేవర-2’పైనా మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


