News April 13, 2025
TODAY HEADLINES

☛ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
☛ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల కీలక ప్రకటన
☛ TGలో ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు
☛ వనజీవి రామయ్య కన్నుమూత
☛ వక్ఫ్ చట్ట సవరణపై బెంగాల్లో అల్లర్లు.. 110 మంది అరెస్ట్
☛ దేశంలో ఉగ్రదాడులకు అవకాశం: నిఘా వర్గాలు
☛ UPI, వాట్సాప్ సేవల్లో అంతరాయం
☛ ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం
☛ IPL: PBKSపై SRH విజయం.. అభిషేక్ శర్మ సెంచరీ
Similar News
News April 14, 2025
నిప్పుతో చెలగాటమాడద్దు.. హసీనా వార్నింగ్

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం నిర్మించిన ముక్తి జోధా కాంప్లెక్స్‌లను దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ తొలగిస్తున్నారని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. ‘నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించివేస్తుందని’ అని హెచ్చరించారు. యూనస్ విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశ పతనానికి యత్నించారని ఆరోపించారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా బంగ్లాకు వెళ్తానని ఇటీవల ప్రతిజ్ఞ చేశారు.
News April 14, 2025
‘నిన్ను ఇంట్లోనే చంపుతాం’.. సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. ‘సల్మాన్.. నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం’ అని వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఈ నంబర్ ముంబై వర్లీలోని రవాణా శాఖ పేరు మీద ఉంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
News April 14, 2025
BREAKING: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

TG: ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. A గ్రూపునకు 1 శాతం, B గ్రూపునకు 9 శాతం, C గ్రూపునకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది.