News April 13, 2025

TODAY HEADLINES

image

☛ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
☛ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల కీలక ప్రకటన
☛ TGలో ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు
☛ వనజీవి రామయ్య కన్నుమూత
☛ వక్ఫ్ చట్ట సవరణపై బెంగాల్‌లో అల్లర్లు.. 110 మంది అరెస్ట్
☛ దేశంలో ఉగ్రదాడులకు అవకాశం: నిఘా వర్గాలు
☛ UPI, వాట్సాప్ సేవల్లో అంతరాయం
☛ ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం
☛ IPL: PBKSపై SRH విజయం.. అభిషేక్ శర్మ సెంచరీ

Similar News

News April 17, 2026

మోదీని ‘జాదూగర్’ అన్న రాహుల్.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

image

మహిళా రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా PM మోదీని జాదూగర్(మెజీషియన్) అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రధానిని అవమానిస్తున్నారంటూ BJP సభ్యులు మండిపడ్డారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 140Cr ప్రజలకు ప్రతినిధి అయిన మోదీని ఎగతాళి చేయడం సరికాదని రాజ్‌నాథ్ విమర్శించారు. ఈ క్రమంలో LoP వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.

News April 17, 2026

టెన్త్ ఫలితాలపై BIG UPDATE

image

AP: టెన్త్ ఫలితాలు ఈ నెలాఖరులో వెల్లడయ్యే అవకాశముంది. పేపర్ల మూల్యాంకనం పూర్తిచేసిన బోర్డు ఫలితాల విడుదలకు సిద్ధమవుతోంది. ‘సందేహాలున్న ఆన్సర్ షీట్లపై DEOలతో మాట్లాడి పరిష్కరించాం. డిఫికల్టీ ప్రశ్నలపై ఎక్స్‌పర్ట్స్ పరిశీలనా పూర్తయ్యింది. హిందీ తప్ప మిగిలిన ఏ సబ్జెక్టులోనూ సమస్య లేదు. మార్కుల కంప్యూటరీకరణ, వెరిఫికేషన్‌ కోసం 14రోజుల టైమ్ పడుతుంది. ఆపై రిజల్ట్స్ ప్రకటిస్తారు’ అని ఓ అధికారి తెలిపారు.

News April 17, 2026

మాత్రలను చల్లటి నీటితో వేసుకుంటున్నారా?

image

ఏదైనా అనారోగ్యానికి మాత్రలను, పొడి రూపంలోని ఔషధాలను గ్లాసు గోరు వెచ్చని నీటితో వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చల్లటి నీటితో తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ కరగడం ఆలస్యమవుతుందంటున్నారు. ‘పాలు, జ్యూస్‌లు, కూల్ డ్రింకులు, లిక్కర్‌తో మందులు వేసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుంది. మాత్రలను పొడి చేయడం, నీళ్లలో కలపడం లాంటివి చేయొద్దు. దీనివల్ల ఒకేసారి మందు విడుదలై ప్రమాదకరంగా మారొచ్చు’ అని చెబుతున్నారు.