News April 13, 2025
కృష్ణా జలాల పంపిణీపై 15 నుంచి విచారణ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 ఈ నెల 15 నుంచి మరోసారి విచారణ జరపనుంది. 3 రోజుల పాటు జరిగే విచారణలో TG తరఫున ఇప్పటికే 2 దఫాలు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ మరో 2 లేదా 3 సార్లు వాదించనున్నారు. ఆ తర్వాత AP తరఫున వాదనలు ప్రారంభం అవుతాయి. ఈ ట్రైబ్యునల్ విచారణకు తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరు కానున్నారు.
Similar News
News April 15, 2025
నా పాటలు వాడుకున్నందుకు రూ.5కోట్లు ఇవ్వాలి: ఇళయరాజా

హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నిర్మాతలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్ ఇచ్చారు. తాను గతంలో స్వరపరిచిన 3 పాటలను వాడుకున్నారని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా ఉపయోగించినందుకు రూ.5కోట్లు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపించారు. కాగా గతంలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మేకర్స్‌కూ ఆయన నోటీసులిచ్చారు.
News April 15, 2025
గురుకుల విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసుకోవచ్చు!

TG: ఎస్సీ గురుకులాల్లో ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా విద్యార్థులు ఎన్నిసార్లైనా ఫ్రీగా పేరెంట్స్‌తో మాట్లాడొచ్చు. విద్యార్థులను బట్టి 7-10 ఫోన్లు అందుబాటులో ఉంటాయి. నలుగురికి ఒక కాలింగ్ కార్డిస్తారు. అందులో రిజిస్టర్ చేసిన నంబర్స్‌కే కాల్ వెళ్తుంది. హెల్ప్ సెంటర్ నంబరుకూ కాల్ చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. స్మార్ట్ ఫోన్ కానందున నిరుపయోగం అయ్యే ఛాన్స్ తక్కువ.
News April 15, 2025
ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్!

TG: మంత్రి పదవి విషయంలో పలువురు నేతలు బహిరంగంగా మాట్లాడటంపై సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పదవుల విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, అలా మాట్లాడితే లాభం కంటే మీకే నష్టం ఎక్కువని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పదవుల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని నేతలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క MLA కూడా సోషల్ మీడియా వాడట్లేదని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.