News April 13, 2025

కృష్ణా జలాల పంపిణీపై 15 నుంచి విచారణ

image

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 ఈ నెల 15 నుంచి మరోసారి విచారణ జరపనుంది. 3 రోజుల పాటు జరిగే విచారణలో TG తరఫున ఇప్పటికే 2 దఫాలు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ మరో 2 లేదా 3 సార్లు వాదించనున్నారు. ఆ తర్వాత AP తరఫున వాదనలు ప్రారంభం అవుతాయి. ఈ ట్రైబ్యునల్ విచారణకు తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరు కానున్నారు.

Similar News

News April 10, 2026

తమిళనాడు ఎన్నికల్లో తెలుగోళ్ల హవా!

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. 2011 లెక్కల ప్రకారం అక్కడి జనాభాలో 33.4%, మొత్తం 5.6 కోట్ల ఓటర్లలో 1.4 కోట్ల మంది మన వాళ్లే. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తే. దీంతో వీళ్లు ఎటు వైపు నిలుస్తారనేది ఆసక్తికరం. అధికార DMK 17 మంది, ప్రతిపక్ష AIADMK 22 మంది తెలుగు అభ్యర్థులను బరిలో నిలిపాయి. 234 సీట్లున్న TN అసెంబ్లీకి ఈనెల 23న ఎన్నికలు జరగనున్నాయి.

News April 10, 2026

గులాబీ గూటికి జీవన్ రెడ్డి.. కండువా కప్పనున్న KCR

image

TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి BRSలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న జగిత్యాలలో BRS భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీలో చేరిక తేదీని కన్ఫర్మ్ చేశారు. ఇక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం పట్టు కోల్పోయిందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

News April 10, 2026

ఆర్టీసీలో ట్రైనీ ఫలితాలు విడుదల

image

TGSRTCలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(MST) పోస్టుల ఫలితాలను TSLPRB రిలీజ్ చేసింది. TST పోస్టులకు 9,377 మంది, MST జాబ్స్‌కు 2,755మంది అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు HYD అంబర్‌పేట్ PTCలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. 198 పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్షలు జరిగాయి.