News April 13, 2025
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో బాపట్ల మాజీ ఎంపీ, ఎమ్మెల్యే

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో 33 మందితో సభ్యులను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎంపీ నందిగామ సురేశ్‌లను సభ్యులుగా నియమించింది. బాపట్లకు చెందిన ఇద్దరు మాజీలకు కమిటీలో స్థానం లభించడంతో వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 15, 2025
కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు

రాగల మూడు గంటలు ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.
News April 15, 2025
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 105 శాతంగా నమోదవుతుందని IMD చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. సీజన్ మొత్తం ఎల్నినో పరిస్థితులు నెలకొంటాయన్నారు. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 1న ప్రవేశిస్తాయి. దీంతో దేశంలో వర్షాకాలం మొదలైందని పేర్కొంటారు.
News April 15, 2025
ఏపీ నుంచి ఏపీకి వయా HYD.. గంటా ఆవేదన

AP: వైజాగ్ నుంచి అమరావతికి వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడంపై TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉదయం 8 గంటలకు విశాఖలో బయలుదేరి హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం నడిచే 2 విమానాలు రద్దు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి’ అని ఆయన వాపోయారు.