News April 15, 2025

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు

image

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 105 శాతంగా నమోదవుతుందని IMD చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. సీజన్ మొత్తం ఎల్నినో పరిస్థితులు నెలకొంటాయన్నారు. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 1న ప్రవేశిస్తాయి. దీంతో దేశంలో వర్షాకాలం మొదలైందని పేర్కొంటారు.

Similar News

News April 23, 2025

PSR ఆంజనేయులుకు రిమాండ్

image

AP: ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులుకు విజయవాడ మూడో ఏసీజేఎం కోర్టు మే 7 వరకు రిమాండ్ విధించింది. ముంబై నటి జెత్వానీ కేసులో నిన్న సీఐడీ పోలీసులు ఆయనను HYDలో అరెస్టు చేశారు. ఆమెపై అక్రమ కేసు బనాయించిన కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఈయన జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు.

News April 23, 2025

ఉగ్రదాడి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈ ఘటనలో మొత్తం 28 మంది చనిపోగా, అందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు.

News April 23, 2025

BRS పేరు మారుస్తారా? KTR ఏమన్నారంటే?

image

TG: BRS పేరు మార్చాల్సిన అవసరం లేదని, తీరు మార్చుకోవాలని KTR ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. KCR లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్నారు. KCR కాకుండా తనకు నచ్చిన CM పినరయి విజయన్(కేరళ) అని తెలిపారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, పవన్ కళ్యాణ్ తాను ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. మోదీ మతపరమైన అజెండాను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటివరకు PMగా చేసిందేం లేదని అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!