News April 13, 2025
ఇంటర్ ఫెయిల్ అవుతానేమోననే భయంతో..

TG: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో విషాదం నెలకొంది. ఇటీవల రాసిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ప్రణీత(18) అనే అమ్మాయి బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. ఆమె పుట్టినరోజే ఇలా చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని కొన్నిరోజులుగా కూతురు ఆవేదనతో ఉందని వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 15, 2025
ప్రతీకార రాజకీయాలకు ఇది నిదర్శనం: కాంగ్రెస్

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఛార్జిషీటులో ఈడీ <<16108914>>చేర్చడంపై<<>> కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు, బెదిరింపులకు ఇది నిదర్శనమని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై తమ పార్టీ మౌనంగా ఉండదని, సత్యమేవ జయతే అంటూ Xలో ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం చట్టబద్ధమైన పాలన ముసుగులో చేస్తున్న రాజకీయమని రమేశ్ మండిపడ్డారు.
News April 15, 2025
కొత్త సినిమా కలెక్షన్ల సునామీ

అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తమిళనాడులో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సంభవం కొనసాగుతోందని పేర్కొంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. అజిత్ కెరీర్‌లో తమిళనాడులో తొలి రోజే అత్యధిక ఓపెనింగ్స్(రూ.30కోట్లు+) రాబట్టిన చిత్రంగానూ నిలిచింది.
News April 15, 2025
ట్రాఫిక్ చలాన్ల జారీలో కీలక మార్పులు!

వాహనదారులకు విధించే చలాన్లపై కేంద్రం కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని తీసుకొచ్చింది. చలాన్లు విధించే ఆటోమేటెడ్ కెమెరాలు కనీసం 10 సెకన్ల ఫుటేజ్‌ను రికార్డ్ చేయాలని ఆదేశించింది. ట్రాఫిక్ చలాన్ల అమలులో పారదర్శకతను పెంచేందుకు ఈ చర్యకు సిద్ధమైనట్లు తెలిపింది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే 1-10 సెకన్ల వీడియోతో పాటు, టైమ్, లొకేషన్ చూపేలా చలాన్‌లో స్పష్టంగా కనిపించాలని తెలిపింది.