News April 13, 2025

ఇంటర్ ఫెయిల్ అవుతానేమోననే భయంతో..

image

TG: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో విషాదం నెలకొంది. ఇటీవల రాసిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ప్రణీత(18) అనే అమ్మాయి బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. ఆమె పుట్టినరోజే ఇలా చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని కొన్నిరోజులుగా కూతురు ఆవేదనతో ఉందని వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 7, 2026

నందిగామలో అగ్రిగోల్డ్ భూములను పరిశీలించిన CID

image

నందిగామ మండలంలో CID అధికారులు అగ్రిగోల్డ్‌కు సంబంధించిన భూములపై పరిశీలన చేపట్టారు. జిల్లా కమిటీ ఆదేశాల మేరకు సత్యవరం, కంచల, కీసర గ్రామాలలో ఉన్న అగ్రిగోల్డ్ స్థలాలను సందర్శించారు. ఆయా భూములకు సంబంధించిన వివరాలు, రికార్డులను సంబంధిత శాఖల అధికారుల నుంచి సేకరించారు. ఈ కార్యక్రమంలో CID అధికారులతో పాటు RDO కే.బాలకృష్ణ, MRO, సబ్‌రిజిస్ట్రార్ ఉన్నారు.

News February 7, 2026

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్
*శ్రీశైలం ఆలయ ప్రసాదంలోనూ కల్తీ నెయ్యి: సీఎం CBN
*TTD నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ చెప్పింది: జగన్
*KCRను జైల్లో వేయకుండా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?: CM రేవంత్
*తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు
*అగ్ని-3 సక్సెస్.. 3వేల KM దూరంలో ఉన్నా ధ్వంసమే!
*పాకిస్థాన్‌లో సూసైడ్ బాంబింగ్.. 69 మంది మృతి

News February 7, 2026

భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

image

2026 సంవత్సరానికి సంబంధించి భారత రియల్ GDP వృద్ధి రేటు అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.9%కి సవరించింది. భారత వస్తువులపై టారిఫ్‌లను 25% నుంచి 18%కి తగ్గిస్తూ US నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల ఎగుమతులు పెరగడమే కాకుండా, ప్రైవేట్ పెట్టుబడులూ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించింది.