News April 14, 2025
నేడు గుంటూరుకు సీఎం.. ‘P-4’ సభ్యులతో భేటీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లా పొన్నెకల్లులో పర్యటించనున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా అక్కడున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్ సమావేశంలో మాట్లాడతారు. తర్వాత P-4 కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు.
Similar News
News November 1, 2025
ఈ క్షేత్రం నుంచే శివుడు లోకాలను కాపాడుతున్నాడట

ఉజ్జయిని మహాకాళేశ్వర్‌లో శివుడు స్వయంగా మహాకాలుడిగా వెలసి, కాల స్వరూపంలో కొలువై ఉన్నాడు. ఇక్కడి నుంచే శివుడు కాలానికి అధిపతిగా ఉండి, సకల లోకాలను, సమస్త జీవరాశిని రక్షిస్తున్నాడని ప్రగాఢ విశ్వాసం. శివ పురాణంలో చెప్పినట్లుగా, ఈ స్వయంభూ లింగం శక్తి ప్రవాహాలను వెలువరిస్తూ, భక్తులను అకాల మృత్యువు నుండి, కాల భయం నుండి కాపాడుతూ, నిరంతరం రక్షా కవచంగా నిలుస్తుంది. ఆ మహాదేవుడి రక్షణే మనకు రామరక్ష.
News November 1, 2025
IVFలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?

సహజంగా తల్లిదండ్రులు కాలేని దంపతులకు IVF ఒక వరం. ఇందులో 45-50% సక్సెస్ రేట్ ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. సంతానోత్పత్తి మందుల కారణంగా మానసికకల్లోలం, తల, కడుపు నొప్పి, వేడిఆవిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్(OHSS) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మహిళల అండాశయాలు ఉబ్బి శరీరంలోకి ద్రవాన్ని లీక్ చేయవచ్చు.
News November 1, 2025
ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు

✦ ఆధార్‌లో పేరు, అడ్రస్, DOB, ఫోన్ నంబర్‌ను సేవా కేంద్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్(₹75 ఛార్జీ)లో మార్చుకోవచ్చు. ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫొటో అప్‌డేట్ కోసం మాత్రం వెళ్లాలి.
✦ UIDAI కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు ₹75, బయోమెట్రిక్స్‌కు ₹125 చెల్లించాలి. 2026, JUN 14 వరకు ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేషన్ ఫ్రీ
✦ 2025, DEC 31లోపు ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి


