News April 14, 2025
నేడు గుంటూరుకు సీఎం.. ‘P-4’ సభ్యులతో భేటీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లా పొన్నెకల్లులో పర్యటించనున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా అక్కడున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్ సమావేశంలో మాట్లాడతారు. తర్వాత P-4 కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు.
Similar News
News April 22, 2025
రిటైరైనా A+ కేటగిరీలో కోహ్లీ, రోహిత్, జడ్డూ.. ఎందుకంటే?

అన్ని ఫార్మాట్లు ఆడే వారికే BCCI A+ కేటగిరీ కాంట్రాక్టు కట్టబెడుతుంది. కానీ గతేడాది కోహ్లీ, రోహిత్, జడేజాలు టీ20లకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వారు వన్డేలు, టెస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిపై క్రికెట్ అభిమానుల్లో సందేహం నెలకొంది. అయితే, వీరు అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. దీంతో వీరికి A+ కేటగిరీ కాంట్రాక్టు లభించింది.
News April 22, 2025
అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న PM నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాలని అమిత్ షాను PM ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.
News April 22, 2025
ఇన్‌స్టాలో RCB మరో మైలురాయి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో ఆర్సీబీ ఫ్రాంచైజీ మరో మైలురాయి చేరుకుంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ టీమ్‌కు 19 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత CSK (18.3M), MI(17M), KKR(7.3M), SRH (5.4M), RR(4.9M), GT (4.7M), DC (4.5M), PBKS(4M), LSG (3.6M) ఉన్నాయి.