News April 15, 2025

యూరిన్ ఆపుకుంటున్నారా?

image

బిజీగా ఉండటం, వాష్‌రూమ్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మూత్ర విసర్జనను ఆపుకుంటూ ఉంటాం. ఇది తరుచూ జరిగితే మూత్రాశయం సాగి కండరాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, కిడ్నీలపై భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుందంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. సరిపడా నీళ్లు తాగుతూ ఎప్పటికప్పుడు మూత్రవిసర్జన చేయాలని సూచిస్తున్నారు.

Similar News

News April 19, 2025

30 ఏళ్లు దాటిన మహిళలకు అలర్ట్!

image

మహిళల ఆరోగ్యం పాడైతే ఇల్లు అనే బండి సాఫీగా కదలదు. ముఖ్యంగా ఇంటి పనులతో పాటు జాబ్ చేసే ఆడవారికి 30 ఏళ్లు దాటితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వారంతా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష(HPV), రొమ్ము క్యాన్సర్ టెస్ట్, బ్లడ్ షుగర్‌తో పాటు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఏదైనా జబ్బు బయటపడితే తొందరగా నయం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

News April 19, 2025

పాన్ ఇండియా లెవల్‌లో దృశ్యం-3

image

మలయాళం సినిమాలు దృశ్యం, దృశ్యం-2 అన్ని భాషల్లో రీమేక్ అయి మంచి విజయాలు అందుకున్నాయి. దృశ్యం-3 తెరకెక్కించే పనుల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బిజీగా ఉండగా, ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దృశ్యం-3ని రీమేక్ చేయకుండా, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని భాషల్లో కలుపుకొని రూ.500 కోట్లు వసూలు చేయాలని హీరో మోహన్‌లాల్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.

News April 19, 2025

చిన్నస్వామిలో మారని RCB కథ!

image

IPL: PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం RCBకి తొలి నుంచీ మైనస్సే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని అంటున్నారు.

error: Content is protected !!