News April 15, 2025
యూరిన్ ఆపుకుంటున్నారా?

బిజీగా ఉండటం, వాష్‌రూమ్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మూత్ర విసర్జనను ఆపుకుంటూ ఉంటాం. ఇది తరుచూ జరిగితే మూత్రాశయం సాగి కండరాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, కిడ్నీలపై భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుందంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. సరిపడా నీళ్లు తాగుతూ ఎప్పటికప్పుడు మూత్రవిసర్జన చేయాలని సూచిస్తున్నారు.
Similar News
News April 25, 2025
మరో సంచలన నిర్ణయం దిశగా భారత్?

ఉగ్రదాడి తర్వాత పాక్‌పై దౌత్యచర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. FEB 24, 2021న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయనున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఉగ్ర సంస్థలు కశ్మీర్‌లోకి చొరబడటంతోపాటు తరచూ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి మన సైన్యానికి అదనపు బలం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
News April 25, 2025
SC గురుకులాల్లో ప్రవేశాలు.. నేటి నుంచి దరఖాస్తులు

TG: రాష్ట్రంలోని 239 ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉంటాయి. టెన్త్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tgswreis.cgg.gov.in/
News April 25, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25% తగ్గించడంతో ఆ మేర రుణ రేటును కుదించనున్నట్లు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రకటించాయి. దీంతో కెనరా బ్యాంకులో హౌస్ లోన్ కనీస రేటు 7.90%, వాహన రుణ రేటు 8.20% నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ బ్యాంక్ గృహ రుణ రేటు 7.90%, వెహికల్ లోన్ రేటు 8.25% నుంచి మొదలవుతాయి. ఈ నెల 12 నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.